
బెంగుళూరు: పాకిస్తాన్ 8మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా... న్యూజిలాండ్ కూడా 8మ్యాచ్‌ల్లో 4విజయాతో 4వ స్థానంలో ఉంది. రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో పాక్ కంటే ఒక మెట్టు పైన కివీస్ ఉంది. పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను 11న ఇంగ్లండ్‌తో ఆడనుండగా, న్యూజిలాండ్ తన చివరి లీగ్‌ను 9న శ్రీలంకతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడి, ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ నెగ్గితే సెమీస్ సమీకరణలు మారనున్నాయి. పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో నెగ్గితే రన్ రేట్ కీలకమవుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7మ్యాచ్‌ల్లోనే 4విజయాలు సాధించి సెమీస్ బెర్తు కోసం ఎదురుచూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచుల్లో ఒకటి నెగ్గినా.. పాకిస్తాన్, కివీస్ జట్లతో సెమీస్ బెర్తు కోసం పోటీ పడుతుంది. ఆఫ్ఘన్ గనుక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితే... పాకిస్తాన్, కివీస్‌లకు దారులు మూసుకుపోయినట్లే. ఆఫ్ఘన్ తన చివరి రెండు లీగ్‌లు ఆడాల్సింది ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లతో. 4న ఆసీస్ గెలిస్తే మూడో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది. అధికారికంగా సెమీస్ బెర్తు ఖరారు అవ్వాలంటే సఫారీలు మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది.