
బాగేపల్లి : ఓట్ల కోసం నోట్లు ఎరగా వేసే బూర్జువా పార్టీలకు ..నిరంతరం ప్రజల పక్షాన పోరాడే వామపక్షాలకు తేడా ఏమిటో తెలియజేసే చిత్రమిది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బాగేపల్లి స్థానం నుంచి సిపిఎం తరుపున పోటీ చేస్తున్న ప్రజా వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్‌కు ఎన్నికల ప్రచారానికి అవసరమైన డబ్బును ప్రజలే సమకూర్చుతున్నారు. బాగేపల్లి సమీపంలోని నారేమద్దిపల్లిలో ఆదివారం నాడు సిపిఎం కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా ఒక మైనార్టీ కుటుంబం ఎదురొచ్చి విరాళం అందజేసింది. ఫాహీమా బాను అనే మహిళ తన చిన్నారులు నజియా, గజియాతో కలిసి వచ్చి వారు డబ్బులు దాచుకున్న హుండీని డాక్టర్ అనిల్ కుమార్‌కు అందజేశారు. ప్రజా ఉద్యమాలకు ఓటుతో పాటు నోటు రూపంలోనూ అండగా ఉంటామని చాటి చెప్పారు.