
బ్రసిలీయా : యాపిల్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఛార్జర్ అవసరం లేని ఐఫోన్‌ని బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించి, ఆ కంపెనీకి 2.4 మిలియన్ల డాలర్లను అంటే సుమారు రూ. 191 కోట్లను జరిమానా విధించినట్లు మంగళవారం వెల్లడించింది. దీంతో బ్రెజిల్ అధికారులు ఐఫోన్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. యాపిల్ కంపెనీ చేసిన ఈ ఉత్పత్తిని అసంపూర్తిగా తయారుచేసి విక్రయిస్తుందని, ఇలాంటి ఉత్పత్తుల వల్ల వినియోగదారుల్లో వివక్షకు దారి తీస్తుందని, బాధ్యతారాహిత్యంగా ఉందని అధికారుల విచారణలో తేలింది. అందుకే యాపిల్ ప్రొడక్ట్స్‌పై నిషేధం విధించడం జరిగింది. అయితే యాపిల్ కంపెనీ గతంలోనూ బ్రెజిలియన్ స్టేట్ ఏజెన్సీల నుండి జరిమానాలను ఎదుర్కొంది. పర్యావరణానికి హాని చేయకూడదనే లక్ష్యంతోనే ఛార్జర్ అవసం లేని ఐ ఫోన్లను తయారు చేయడం జరిగిందని యాపిల్ ఆరోపించింది. అయితే ఇలాంటి ఉత్పత్తులను అనుమతించబోమని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది.