Nov 02,2023 15:21

తిరువనంతపురం :    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. సిఎం పినరయి విజయన్‌ను హత్య చేస్తానని బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ ప్రధాన కార్యాలయానికి అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసినట్లు పోలీసులు గురువారం  తెలిపారు.   అయితే మీడియా కథనాల్లో పేర్కొన్నట్లు మైనర్‌ బాలుడు ఆ ఫోన్‌ చేశాడా అని ప్రశ్నించగా .. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మ్యూజియం పోలీస్‌ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్‌ 118 (బి), 120 (ఒ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  రెండు రోజుల క్రితం కేరళలోని కలమస్సేరి కన్వెన్షన్ హాల్ లో వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.