న్యూఢిల్లీ : ఐఫోన్‌ల హ్యాకింగ్‌పై కేంద్రం స్పందించింది. సుమారు 150 దేశాల్లో యాపిల్ సంస్థ వార్నింగ్ మెసేజ్‌లను జారీ చేసిందని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మంగళవారం పేర్కొన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌లు తప్పుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నారు. అలర్ట్ మెసేజ్‌లపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మెసేజ్‌లు అందుకున్న వారితో పాటు యాపిల్ సంస్థ కూడా ఆ దర్యాప్తునకు సహకరించాలని ఆయన కోరారు. తమ ఐఫోన్‌లు హ్యాకింగ్‌కు గురయ్యాయని యాపిల్ సంస్థనుండి అలర్ట్ మెసేజ్‌లు వచ్చినట్లు ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే.