Sep 21,2023 16:48

ప్రజాశక్తి కలక్టరేట్(కృష్ణా) :జిల్లాలోని 136 గ్రామాల్లో మూడవ దశ రీసర్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయని కలెక్టర్ పి.రాజాబాబు ఉన్నతాధికారులకు తెలిపారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయి ప్రసాద్, అదనపు కమిషనర్ ఏఎండి ఇంతియాజ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూముల రీ సర్వే, భూ హక్కు పత్రాల పంపిణీ పై జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడవ దశ రీ సర్వే కార్యక్రమం  136 గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతోందన్నారు. అందులో చివరి ఆర్ ఓ ఆర్ ఐదు గ్రామాల్లో పూర్తయిందని, 13 నోటిఫికేషన్ 7  గ్రామాలకు జారీ చేశామని, 31 గ్రామాల్లోని 42,739 ఎకరాల్లో భూమి లెక్క కట్టామని, 73 గ్రామాల్లోని  11,333 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేసామన్నారు. అలాగే రెండవ దశలో రీ సర్వే చేపట్టిన  53 గ్రామాలకు గాను అన్ని చోట్ల రీ సర్వే పూర్తి అయిందని, అందులో 51 గ్రామాల్లో సరిహద్దు రాళ్లు నాటామని చెప్పారు జిల్లాకు 45,799 సరిహద్దులు  రాళ్లు రాగా అందులో 42,942 రాళ్ళను ఇప్పటికే నాటామని ఇక రెండు గ్రామాల్లో 2,857 రాళ్లు నాటాల్సి ఉందన్నారు. వాటిని కూడా త్వరగా  నాటుతామన్నారు. జిల్లాలో 25,650 భూహకు పత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 17,299  జిల్లాకు  అందులో 13,351 పత్రాలను  ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. ఇంకనూ 3,948 పత్రాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ పి. వెంకటరమణ,  భూ సర్వే రికార్డుల ఏడి రంగారావు, కలెక్టరేట్ కోఆర్డినేషన్ తహసిల్దార్ సురేష్ పాల్గొన్నారు.