Nov 29,2022 22:05

ఫోర్బ్స్‌ ఇండియాా100 జాబితా వెల్లడి
కుబేరుల్లో అదానీ టాప్‌
రెండో స్థానంలో అంబానీ

ముంబయి : అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో దేశ ప్రజల ఆదాయాలు పడిపోతుంటే.. కార్పొరేట్ల సంపద మాత్రం వేల కోట్లు పెరుగుతూ పోతోంది. అమెరికాకు చెందిన ఫోర్బ్స్‌ మాగజైన్‌ భారత్‌లోని వంద మంది సంపన్నుల జాబితా-2022ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది వీరి సంపద రూ.2 లక్షల కోట్లు (25 బిలియన్‌ డాలర్లు) పెరిగి మొత్తంగా 800 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.65.32 లక్షల కోట్లు)కు చేరిందని ఫోర్బ్స్‌ తెలిపింది. ఆ 100 మంది టాప్‌ సంపన్నుల వద్ద ఉన్న సొమ్ములో 30 శాతం అదానీ, అంబానీ వద్దే పోగు పడింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ.. రూపాయి విలువ, స్టాక్‌ మార్కెట్లు పడిపోతున్నప్పటికీ, ఆర్థిక మాందగమనం చోటు చేసుకుంటుందనే రిపోర్టుల మధ్య సంపన్నుల ఆదాయం పెరగడం విశేషం. అదానీ రూ.12.2 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో నిలిచారు. అదాని సంపద ఈ ఒక్క ఏడాదిలోనే రెట్టింపైందని ఫోర్బ్స్‌ తెలిపింది. ముకేష్‌ అంబానీ రూ.7.18 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరి దరిదాపుల్లో మరెవరూ లేరు. ఈ జాబితాలో తొలి సారి నైకా ఫ్యాషన్స్‌ ఫౌండర్‌ ఫల్గుణీ నాయర్‌ చోటు దక్కించుకున్నారు. పేటియం సిఇఒ విజరు శేఖర్‌ శర్మ ఈ జాబితాలో లేకుండా పోయారు.

స్థానం పేరు సంపద

1. గౌతమ్‌ అదానీ రూ.12,2 లక్షల కోట్లు
2. ముకేష్‌ అంబానీ రూ.7.18 లక్షల కోట్లు
3. రాధాకృష్ణ దమానీ రూ.2.23 లక్షల కోట్లు
4. సైరస్‌ పూనావాలా రూ.1.74 లక్షల కోట్లు
5. శివ్‌ నాడార్‌ రూ.1.73 లక్షల కోట్లు.
6.సావిత్రి జిందాల్‌ రూ.1.32 లక్షల కోట్లు
7.దిలీప్‌ సంఘ్వీ రూ.1.25 లక్షల కోట్లు
8. హిందుజా సోదరులు రూ.1.23 లక్షల కోట్లు
9. కుమార మంగళం బిర్లా రూ.1.21 లక్షల కోట్లు
10.బజాజ్‌ ఫ్యామిలీ రూ.1.18 లక్షల కోట్లు.