ఇంటర్నెట్‌డెస్క్ : శీతాకాలంలో వాయుకాలుష్యం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చిన్నారులకి, పెద్దలకి, న్యూమోనియా సమస్య ఉన్నవారికి త్వరగా ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నవారు ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. మరి ఈ కాలంలో రోగనిరోధకశక్తి పెరిగే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అవిసె గింజలు : ఒమేగా - 3 అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఆస్తమా ఉన్నవారు నానబట్టిన అవిసెగింజల్ని ప్రతిరోజూ రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు వాయుకాలుష్య ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. అందుకే అవిసెగింజల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఉసిరి : ఉసిరిలో విటమిన్ - సి ఉంటుంది. ఇది వాతావరణ ప్రతికూల ప్రభావాలను నివారించంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. శీతాకాలంలో ప్రతిరోజూ ఉసిరి జ్యూస్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పసుపు : కూరల్లోనే కాదు.. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
బ్రోకలీ : బ్రోకలీలో ఉన్న విటమిన్ సి బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. బ్రోకలీని చలికాలంలో తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.