Apr 22,2023 21:18

హైదరాబాద్‌ : కన్స్యూమర్‌ టెక్‌ సంస్థ ఉడ్‌ఛలో అధునాతన విద్యుత్‌ వాహనం 'వీర్‌బైక్‌'ను విడుదల చేసినట్లు ప్రకటించింది. పర్యావరణ అనుకూల, అందుబాటు ధరల్లో రవాణా అవకాశాలను ప్రతి ఒక్కరికీ అందించాలనే కంపెనీ ప్రయత్నాలలో ఇది ఓ భాగమని వీర్‌ బైక్‌ కోాఫౌండర్‌, ఆర్‌అండ్‌డి హెడ్‌ సాహిల్‌ ఉత్తేకర్‌ తెలిపారు. ''అత్యున్నత పనితీరు కనబరిచే విద్యుత్‌ సైకిల్‌ వీర్‌ బైక్‌. సౌకర్యవంతమైన, మృదువైన సవారీని ఇది అందిస్తుంది. అత్యంత కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకునేలా తీర్చిదిద్దాము. రోజువారీ వినియోగానికి అత్యంత అనుకూలమైనది.'' అని సాహిల్‌ పేర్కొన్నారు. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేశామని ఉడ్‌ఛలో సిఇఒ రవి కుమార్‌ తెలిపారు. ఇది తమ వీర్‌బైక్‌ డాట్‌ కామ్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంటుందన్నారు.