
దేశంలో ఎక్కువగా థైరాయిడ్‌తో బాధపడుతోంది మహిళలే అని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు కారణం వెంటనే దీని లక్షణాలను గుర్తించకపోవడమే. అసలు థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకుంటే మంచిది. వెంటనే పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం, మందులు తీసుకోవచ్చు.
థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక గ్రంథి. ఇది టీ3, టీ4, టీహెచ్‌ఎస్ అనే హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం, తీవ్రమైన అలసట, శరీరం వెంటనే డిప్రెషన్ అవుతూ ఉంటుంది.
గర్భం దాల్చకపోవడం, అబార్షన్లు కావడం, తీవ్ర రక్తస్రావం, మెనోపాజ్ సమయంలోనూ హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ గ్రంధి ప్రభావితం అవుతుంది. 30 ఏళ్లు దాటిన తరువాత ప్రతి అయిదేళ్లకొకసారి థైరాయిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
హైపర్ థైరాయిడ్ లక్షణాలు: ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తుంటాయి. అందుకే సరైన సమయంలో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా తీవ్ర అనారోగ్యానికి లోను కాకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.