Sep 23,2023 21:52
  • గోదావరి ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ వెల్లడి

హైదరాబాద్‌ : గోదావరి ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ కొత్తగా విద్యుత్‌ త్రీ వీలర్‌ కార్గో విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. ఇందులో ఇ-లోడర్‌, ఎబ్లూ రెనోను విడుదల చేసినట్లు పేర్కొంది. కార్గో విభాగంలో కంపెనీ నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి అని పేర్కొంది. ఎబ్లూ రెనో కోసం ప్రీ బుకింగ్‌లు తెరిచినట్లు తెలిపింది. కంపెనీ ఎక్స్‌షోరూం ధరను రూ.3,34,999గా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎబ్లూ రోజీ త్రీ వీలర్‌, ఎబ్లూ స్పిన్‌, ఎబ్లూ థ్రిల్‌ ఇ-సైకిళ్లను, ఎబ్లూ ఫియో ఇవి స్కూటర్‌లను విక్రయిస్తోంది. కొత్త కార్గో త్రీ వీలర్‌ వాహనాలతో కార్గో విభాగంలోకి ప్రవేశించామని గోదావరి ఎలక్ట్రిక్‌ మోటార్స్‌ సిఇఒ హైదర్‌ ఖాన్‌ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 50డీలర్‌ షిప్‌లను కలిగి ఉన్నామని.. వచ్చే మార్చి ముగింపు నాటికి 100కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.