Apr 08,2023 21:18

హైదరాబాద్‌ : బిగాస్‌ ఆటో కొత్తగా సి12 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే డి15, బి8, ఎ2 ఇవిల విజయ బాటలో సి12ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ ప్రీమియం స్కూటర్‌ అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా, అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుందని తెలిపింది. 20కు పైగా భద్రతా ఫీచర్లతో దీన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఒక్క సారి ఛార్జింగ్‌తో 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని తెలిపింది. దీని పరిచయ ధరను రూ.97,999గా ప్రకటించింది.