ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన అద్దంకి మేదరమెట్ట రోడ్ లోని నల్లవాగు సమీపంలో జరిగింది. సోమవారం పోలీసులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ ఎం రోశయ్య తన సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. మృతి చెందిన యువకుడు వయస్సు దాదాపుగా (35) గా ఉంటాయని భావించారు. మఅతుడిని ఎక్కడైనా చంపి తీసుకువచ్చి అక్కడ పడవేశారా లేదా ప్రమాదంలో మృతి చెందితే పక్కన వేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో ఉన్నారు.










