
ప్రజాశక్తి-బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం పెద్దతిప్పసముద్రం మండలం నాగన్నకోట సమీపంలో జరిగింది. ఈరోజు ఉదయం మొలకలచెరువు మండలం, దాదంవారిపల్లికు చెందిన పవన్ (28) బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పీటీఎం ఎస్సై రవీంద్రబాబు, హెడ్ కానిస్టేబుల్ మురళి, ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిమిత్తం మదనపల్లి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.