
కురుపాం (మన్యం) : రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం కురుపాం మండలం గుజ్జుపాడు సమీపంలో జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారికి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారంతా కొరిశీల, కెరడ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.