ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : ఎపి వెలుగు విఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరతూ సిఐటియు ఆధ్వర్యంలో 36 గంటల పాటు ధర్నా, వంట వార్పు కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివో ఏల జిల్లా గౌరవాధ్యక్షుడు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివోఏల సమస్యలు పరిష్కారం చేయకుండా గత నాలుగు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పటికైనా వివోఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయేది ఎన్నికల కాలమే అని గుర్తుపెట్టుకోవాలని లేకుంటే వైసిపి ప్రభుత్వానికి వివోఏళ్లంతా ప్రజల ఐకమత్యం చేసి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతారని హెచ్చరించారు. మూడు సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని,సి.బి.ఓ.హెచ్.ఆర్ పాలసి అమలు చేయాలని,10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విఓల మెర్జ్ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని.. లోకో యాప్ వర్క్ కోసం 5 జి మొబైల్ ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. వాలంటీర్ ఐడితో కాకుండా.. విఓఎ ఐడి ద్వారా పనిచేయించాలన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు జీను రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ ధర్నాలో జిల్లా కార్యదర్శి పి.నాగరాజు, నాయకులు శ్రీధర్, మంగమ్మ, శేషాద్రి,శాంతి, చంద్రబాబు,మణి లతో పాటు విఓఏలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.