ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : కార్వేటి నగరం మండలం ఆలత్తూరు ఎంపీటీసీ బండి దేవి ప్రియ తండ్రి పోలి.చక్రపాణి రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ.. తిరుపతిలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, జన్ అకాడమీ అధ్యక్షులు నూకతోటి రాజేష్ చక్రపాణి రెడ్డి మతి దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ బండి దేవి ప్రియను, ఆమె భర్త జగదీష్‌రెడ్డిని పరామర్శించి కుటుంబాని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకనాధరెడ్డి, వెంకటరమణ, మునిరెడ్డి, మురార్జీ, సుధాకర్డరెడ్డి తదితరులు పాల్గొన్నారు.