May 26,2023 21:16

న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ)తో మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని గూగుల్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ఎరిక్‌ స్మిత్‌ హెచ్చరించారు. ఇది పలువురికి హాని తలపెట్టడమే కాకుండా.. పెద్ద సంఖ్యలో ప్రజలకు కీడును చేయనుందన్నారు. దీని ద్వారా మరణాలూ సంభవించే అవకాశం లేకపోలేదని వాల్‌స్ట్రీట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో స్మిత్‌ పేర్కొన్నారు. మోసకారి వ్యక్తుల బారి నుంచి ఎఐ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. చాట్‌జిపిటి రాకతో టెక్‌ దిగ్గజాలు పోటాపోటీగా ఎఐ ఆవిష్కరణలు చేస్తున్న విషయం తెలిసిందే.