
మ. 2.00గం||ల నుంచి
లక్నో: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో వరుసగా ఐదు విజయాలతో జోరుమీదున్న టీమిండియా.. రేపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియా ఐదుసార్లు టైటిల్ విజేత ఆస్ట్రేలియాకు ఝలక్ ఇచ్చి ఆ తర్వాత పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లను ఓడించి దుర్భేద్య ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా బలంగా ఉన్నా.. హార్దిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరంగా కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్‌పై నెగ్గి న్యూజిలాండ్, శ్రీలంక, ఆఫ్ఘన్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో ఓడి సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
జట్లు(అంచనా)..
భారత్: రోహిత్‌శర్మ(కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, శ్రేయస్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్, జడేజా, అశ్విన్/సిరాజ్, కుల్దీప్, బుమ్రా, షమీ.
ఇంగ్లండ్: బెయిర్‌స్టో, మలన్, రూట్, స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, వోక్స్, విల్లీ, రషీద్, మార్క్‌వుడ్/బ్రూక్.