కేంద్రానికి లేఖ రాసిన ఆర్థికశాఖ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా తీసుకురటున్న రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గిరచుకునేరదుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వివిధ దేశాల నుంచి తీసుకురటున్న ఈ రుణాలను ఒకే దేశ కరెన్సీకిందకు మార్పు చేసేరదుకు ఆలోచన చేస్తోంది. అయితే ఇది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో తాజాగా కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.రాష్ట్రంలో అమలు చేస్తున్న అనేక పథకాలకు సంబంధిరచి కేంద్ర సాయంతో అనేక విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా అమెరికన్ డాలర్, యూరో కరెన్సీ, జపాన్ యెన్, అరతర్జాతీయ ద్రవ్య నిధికి సంబందించిన ఎక్స్‌డిఆర్ కరెన్సీల ద్వారానే చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఎక్కువగా అమెరికన్ డాలర్‌తోనే చెల్లింపులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిపై వడ్డీ 6.30 శాతంగా ఉంటోంది. ఇది ఖజానాపై అధిక భారంగా మారుతోంది. జపాన్‌కు చెందిన యెన్ కరెన్సీకి వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంతో మొత్తం రుణాలను ఆ కరెన్సీ కిందకు మార్పు చేయాలని రాష్ట్ర అధికారులు కోరుతున్నారు. అధిక వడ్డీ కారణంగా ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకు ఆర్థిక వెసులుబాటు వేస్ అరడ్ మీన్స్‌పైనా ఈ అధిక వడ్డీ రేట్లు ప్రభావం చూపిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.అందుకే అన్ని కరెన్సీలను ఒకే కరెన్సీకిందకు తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.










