Oct 26,2022 10:41

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ తుదివిడత కౌన్సెలింగ్‌లో మంగళవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 177 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 79,346 సీట్లున్నాయని వివరించారు. వాటిలో 63,899 (80.53 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 15,447 (19.47 శాతం) సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఫార్మసీ కోర్సుల్లో 4,025 సీట్లుండగా, 60 (1.49 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు.
 

                                                    సిఎస్‌ఇ అనుబంధ కోర్సుల్లో మిగిలిన సీట్లు 3,256

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సిఎస్‌ఇ) అనుబంధ కోర్సుల్లో 49,031 సీట్లు అందుబాటులో ఉన్నాయని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. వాటిలో 45,775 (93 శాతం) మందికి సీట్లు కేటాయించామనీ, 3,256 (7 శాతం) మిగిలిపోయాయని పేర్కొన్నారు.