వాన వాన వచ్చింది
వాకిట ముందు కురిసింది
చల్లని గాలి వీచింది
ఉక్కపోతను తరిమింది
చెట్టు నిండుగా తడిసింది
పచ్చని చిగురు వేసింది
ప్రకృతి పచ్చగా మెరిసింది
పుడమికి కాంతిని తెచ్చింది
నాగలి దున్నుతూ పోయింది
చేను సాగును చేసింది
విత్తులు వత్తుగా విత్తింది
మొక్కకు ప్రాణం పోసింది
చెరువు నిండుగా తొణికింది
కాలువ బాగా పారింది
పడవ నీటిలో పరిగెత్తింది
మనసుకు హాయిని తెచ్చింది
చిటపట చినుకు కురిసింది
వడగళ్ళు దోసిలి నింపింది
శీతల బల్బులు వెలిగించింది
తొలకరి గురుతుకు తెచ్చింది
నేలకు తాపం పోగొట్టింది
ఎండమావిని తరిమేసింది
భూమిని తడిగా వుంచింది
ఆహ్లాదాన్ని కలిగించింది
మేఘాల గుంపు చేరింది
చినుకు చినుకుగా రాలింది
వాగు వంకలై పొర్లింది
చివరికి సంద్రంలో కలిసింది!
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636










