ప్రజాశక్తి-రాంబిల్లి (అనకాపల్లి) : తమ సమస్యల పరిష్కారాన్నికోరుతూ నేవల్ బేస్ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళన మంగళవారానికి 23వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వినూత్న రీతిలో, ధర్నా శిబిరం పక్కనే ఉన్న పైడమ్మ తల్లి ఆలయం వద్ద, నిర్వాసితులు పెద్ద ఎత్తున, గుడి చుట్టూ దండాలు పెడుతూ.. నేటికి ఇరవై మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న మా సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు పట్టించుకోలేదమ్మా, మీరైనా మా సమస్యలు పరిష్కారానికి దారి చూపాలని, వేడుకున్నారు. ఈ ధర్నా శిబిరానికి ఎలమంచిలి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తరఫున మండల పార్టీ అధ్యక్షులు దిన్ బాబు 50 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు నిర్వాసితులు ఎనిమిది గ్రామాలు పెద్దలు పాల్గొన్నారు










