హనుమకొండ : తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు. ఇటీవల లడక్ వెళ్లి అక్కడ శిక్షణ ముగించి వచ్చిన హనుమకొండకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది మహిళలు శనివారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేదరిక నిర్మూలన, మహిళల ఆర్థికాభివఅద్ధికి చేస్తున్న కఅషిని వివరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని వెల్లడించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలలో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ ఇన్‌చార్జి సీఈవో, వరంగల్ డీఆర్‌డీవో సంపత్ రావు, సెర్ప్‌నకు చెందిన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన మహిళలు, రిసోర్స్ పర్సన్స్, సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.










