
ప్రజాశక్తి - బుచ్చయ్య పేట ( అనకాపల్లి జిల్లా ) : అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో పూడి గ్రామ సచివాలయ భవనానికి, భవన యజమాని బుధవారం తాళం వేశారు. గత రెండున్నర సంవత్సరాలుగా భవనానికి సంబంధించిన అద్దె ప్రభుత్వం నుండి చెల్లించకపోవడంతో యాజమని సలాది బాబురావు బుధవారం ఉదయం సచివాలయంకి తాళం వేశారు. నెలకు రూ.2,500 చొప్పున రెండున్నర సంవత్సరాలుగా చెల్లించాల్సిన అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. దీంతో విధులకు వచ్చిన సిబ్బంది ఎంపీడీఓ కు సమాచారం ఇచ్చి బయట కూర్చున్నారు. సచివాలయంకు వచ్చినవారంతా బయట ఉండిపోయారు.