Sep 03,2023 12:05

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు బి.మండలంలో శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో .... వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వేసవిని తలపిస్తూ మండుతున్న ఎండల ధాటికి వేడిని తట్టుకోలేక ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. వర్షం కురవడంతో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించారు. తాడిపత్రి రహదారి లోని ఓబుళాపురం గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద రెండు వైపులా లారీలు ఇరుక్కుపోయి బ్రిడ్జి వద్ద మరమ్మతులు జరుగుతుండటంతో బురదలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారి కావడంతో లారీలు, బస్సులు, కార్లు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.