Jun 17,2023 12:27

గుంటూరు : చెక్‌పోస్టు వద్ద లారీని ఆపకుండా అక్కడ విధుల్లో ఉన్న వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటన శనివారం చేబ్రోలు మండలం నారా కోడూరు వద్ద జరిగింది. ధాన్యం లోడుతో వెళుతున్న లారీ, నారా కోడూరు చెక్‌ పోస్ట్‌ వద్ద విధుల్లో ఉన్న హుస్సేన్‌ బాషాను ఢీకొట్టి చెక్‌ పోస్ట్‌ వద్ద ఆపకుండా వెళ్లింది. వెంటనే ఉద్యోగి హుస్సేన్‌ బాషా బైక్‌ తో లారీని వెంబడించాడు. లారీ రేషన్‌ బియ్యంతో వెళుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.