మాధవధార (విశాఖ) : లారీ డ్రైవర్‌ను చితకబాది బియ్యం లారీతో దుండగులు పారిపోయిన ఘటన ఆదివారం విశాఖ నగర పరిధిలో జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టు దాటిన తర్వాత గాజువాక వైపు వెళుతున్న బియ్యం లారీని ముగ్గురు దుండగులు ఆపారు. డ్రైవర్‌ను చితకబాది అతడి వద్ద ఉన్న కొంత నగదును లాక్కొని లారీతో పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ కాంతారావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.










