నార్కట్‌పల్లి (నల్గొండ) : టిఫిన్ కోసం ఓ వ్యక్తి బస్సు దిగాడు.. అంతే.. తిరిగి బస్సెక్కేసరికి రూ.28 లక్షలున్న అతడి రెండు బ్యాగులు చోరీ అయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హౌటల్ వద్ద జరిగింది.
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఆరెంజ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నార్కట్‌పల్లి శివారులోని ఓ హౌటల్ వద్ద ఆగింది. ఒడిశాలోని బరంపురం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ వ్యక్తి టిఫిన్ తినడానికి హోటల్ వద్ద దిగాడు. ఈ క్రమంలో ... గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి బస్సులోని రూ.24 లక్షలు, రూ.4 లక్షలతో వేర్వేరుగా ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన సమయంలో బస్సు సిబ్బంది సహా మొత్తం 27 మంది ప్రయాణికులున్నారు. నార్కట్‌పల్లి హౌటల్ వద్ద గత ఏడాదిలోనూ ఇలాంటి రెండు మూడు ఘటనలు చోటుచేసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










