Jul 26,2023 15:12

నల్గొండ :నల్గొండ జిల్లాలో భారీ చోరీ జరిగింది. టిఫిన్‌ చేద్దామని బస్సు దిగిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ ను దొంగలు కొట్టేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బాధితుడు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్కెట్‌ పల్లిలో టిఫిన్‌ కోసం ఆయన బస్సు దిగారు. ఆ సమయంలో బ్యాగ్‌ ను దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాగ్‌ లో రూ. 28 లక్షలు ఉన్నాయి. ఈ ఘటనతో బాధితుడు లబోదిబోమన్నాడు. నార్కెట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.