ప్రజాశక్తి-అమరావతి : రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు సిఆర్‌డిఎ తెలిపింది. ఈ మొత్తం సిఎంఎఫ్‌ఎస్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది. దీనిపై జస్టిస్ బి కృష్ణమోహన్ స్పందిస్తూ.. కౌలు చెల్లింపులపై నివేదికను ఈ నెల 10న జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. రైతులకు వార్షిక కౌలు చెల్లించకపోవడంపై పోతినేని శ్రీనివాస్‌రావు అనే రైతు దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు సిఆర్‌డిఎ పై వివరాలను నివేదించింది.










