Aug 04,2023 08:59

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గతేడాది దేశవ్యాప్తంగా 10.36 కోట్ల జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాల్లో జీరో లావాదేవీలు జరిగాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ తెలిపారు. రాజ్యసభలో సిపిఐ ఎంపి బినయ్ విశ్వం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-23లో ప్రభుత్వ బ్యాంకుల్లో (ప్రాంతీయ బ్యాంకులతో సహా) ఉన్న10.36 కోట్ల జన్‌ధన్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరగలేదని మంత్రి తెలిపారు. 2022-23లో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (పిఎంజెడివై) ఖాతాల్లో జరిగిన మోసాలపై 796 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.