Jul 23,2023 14:12

కొండాపురం (కడప) : లారీ, బస్సును ఢీకొట్టడంతో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలైన ఘటన ఆదివారం కొండాపురం మండలంలో జరిగింది. కొండాపురం మండలంలోని వెంకటాపురం గ్రామ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషముల సమయంలో తాడిపత్రి వైపు నుంచి కడప వైపుకు వస్తున్న వాహనం ముందు టైర్‌ పగిలిపోవడంతో లారీ అదుపుతప్పి తాడిపత్రి వైపు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ కు తీవ్రగాయాలయ్యాయి. బస్సులోని నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తాళ్ల పొద్దుటూరు ఎస్సై మోహన్‌ తెలిపారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.