ప్రజాశక్తి-వల్లూరు (కడప) : కడప తాడిపత్రి జాతీయ రహదారి తప్పెట్ల ఓవర్ బ్రిడ్జి పై డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి డ్రైవర్ బాబా ఫక్రుద్దీన్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ సయ్యద్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం వల్లూరు ఎస్‌ఐ పెద్ద ఓబన్న అందించిన వివరాల మేరకు ... కడప నుంచి ఎర్రగుంట్లకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ టైరు పంక్చరై అదుపుతప్పి కింద పడిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించామన్నారు. ఘటనపై పోలీసులు వివరాలు నమోదు చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.










