
పొంచివున్న వర్షం ముప్పు
మ.2.00గం||ల నుంచి
బెంగళూరు: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, శ్రీలంకజట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనున్నాయి. శ్రీలంక జట్టు సెమీస్ రేసునుంచి ఇప్పటికే నిష్క్రమించగా.. న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై నెగ్గితేనే సెమీస్ రేసులో నిలవనుంది. కివీస్ జట్టు టోర్నీ ప్రారంభంలో వరుసగా నాలుగు విజయాలతో సునాయాసంగా సెమీస్‌కు చేరుతుందని భావించినా.. ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓడి సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో గురువారం శ్రీలంక జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలుపొందడంతోపాటు రన్‌రేట్‌నూ మరింత పెంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లు కూడా న్యూజిలాండ్‌తో పోటీగా నిలవడమే ఇందుకు కారణం. ఈ మూడు జట్లకు 8మ్యాచ్‌లు ముగిసేసరికి 8పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మెరుగైన రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ 4వ స్థానంలో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 5, 6 స్థానాలోల ఉన్నాయి. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు శ్రీలంక చేతిలో ఓడితే సెమీస్‌కు సంక్లిష్టంగా మారనుంది. ఇక మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సంచలన విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా జట్టు 12పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఇప్పటికే సెమీస్‌కు చేరింది. దీంతో సెమీస్‌కు చేరిన జట్ల సంఖ్య 3కు చేరింది. ఇక మిగిలిన ఒక్క బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. మరోవైపు భారత్(16పాయింట్లు), దక్షిణాఫ్రికా(12పాయింట్లు) జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఇక న్యూజిలాండ్ జట్టు పేసర్ లూకీ ఫెర్గ్యూసన్ గాయం నుంచి కోలుకొన్నాడు. దీంతో అతడు ఇష్ సోథీ స్థానంలో జట్టులోకి వచ్చి చేరనున్నాడు.
పొంచివున్న వర్షం ముప్పు...
బెంగళూరులో న్యూజిలాండ్‌ాశ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి వున్నట్లు ఇక్కడి వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన పక్షంలో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ దక్కనుంది. అదే జరిగితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లకు దారి సుగమం కానుంది.
జట్లు(అంచనా)..
న్యూజిలాండ్: కాన్వే, రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), మిఛెల్, లాథమ్(వికెట్ కీపర్), ఫిలిప్స్, సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గ్యుసన్, నీషమ్, యంగ్.
శ్రీలంక: నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండీస్(వికెట్ కీపర్), సమరవిక్రమ, అసలంక, మాథ్యూస్, ధనుంజయ(కెప్టెన్), తీక్షణ, ఛమీర, రజిత, మధుశంక, కరుణరత్నే,