Dec 04,2022 12:47

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : బైక్‌పై వెళ్లేటప్పుడు ఎండాకాలం అయితే మండుటెండ, వర్షాకాలం అయితే వానలో బాధలు తప్పవు. ఈ బాధను అధిగమించి సుఖంగా ప్రయాణించడానికి రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించారు. రూ.6 వేలతో ఇనుపముక్కలను, సీటు కవరును కొని బైక్‌కు నీడనిచ్చేలా అమర్చారు. ఆదివారం మండలంలోని తాళ్ళపాలెం జంక్షన్‌ లో సదరు వ్యక్తి ఆ బైక్‌పై అనకాపల్లి వైపు వెళుతూ సరుకులు కొనుగోలు చేయడానికి కాసేపు బండిని ఆపారు. బైక్‌ పై ఇనుపరాడ్లుతో సీటు ఏర్పాటు చేయడం చూపరులందరినీ ఆకట్టుకుంది. వాహనదారుడు మాట్లాడుతూ ... రాజమండ్రికి చెందిన తాను, తన భార్య, కుమార్తె విశాఖపట్నానికి వెళుతున్నామని తెలిపారు. ఈ ఇనుప ముక్కలు, సీటు కవరుకు రూ.6 వేలు ఖర్చయిందని తెలిపారు. ఎండాకాలం ఎండకు, వర్షాకాలం వర్షాలకు ఇబ్బందిలేకుండా ఈ నీడనిచ్చే ఏర్పాటు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.