
ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఎం సీనియర్ నాయకుడు పోలా రామాంజినేయులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన మెడనొప్పి వ్యాధితో బాధపడుతున్నాడు. దీనికి తోడు షుగర్, గ్యాస్ సమస్యలు తోడయ్యాయి. ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.