
ప్రజాశక్తి - అనంతపురం:ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఎం సీనియర్ నాయకులు పోలా రామాంజనేయులు (71) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అనంతపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు పోలా లక్ష్మీనారాయణ సిపిఎం ధర్మవరం పట్టణ కార్యదర్శిగా పనిచేశారు. కోడలు ఐద్వా నాయకులుగా పనిచేశారు. ఆదివారం ధర్మవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ధర్మవరం కౌన్సిలర్‌గా పోలా రామాంజనేయులు రెండుసార్లు గెలుపొందారు.