
- లక్ష్యానికి బహుదూరంగా సాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేరద్రం అమలు చేస్తున్న ముద్ర పథకం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ పథకం కింద భారీ లక్ష్యాలను ప్రకటించినప్పటికీ ఆచరణ దానికి ఆమడ దూరంలో ఉంది. లబ్దిదారుల సంఖ్యలో కూడా భారీ కోతలు పెడుతున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 9,705 మరదికి లబ్ది చేకూర్చేందుకు బ్యారకులకు లక్ష్యంగా నిర్ణయించారు. దీనికోసం 4,852 కోట్లు వెచ్చించాలని నిర్దేశించుకున్నారు. అయితే అమలులోకి వచ్చేసరికి మాత్రం భారీ తేడా కనిపిస్తోంది. వాస్తవ లక్ష్యానికి, బ్యాంకులకు అందించిన దరఖాస్తులకు, అరదులో మంజూరు చేసినవాటికి, మంజూరు చేసిన వాటిలో పంపిణీ చేసిన వాటికి మధ్య అంతరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 403 మందికే సాయం అందింది. దానికోసం వెచ్చించిన నిధులు కూడా నామమాత్రంగా రూ.283 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఖరారు చేసిన దరఖాస్తుల మేరకు ఇంకా 867 మందికి మాత్రమే ఇవ్వాల్సి ఉందని, అది కూడా రూ.716 కోట్లు మాత్రమేనని చెబుతున్నారు. పెండింగ్ సాయంపై బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదని అధికారులు అంటున్నారు. బ్యాంక్లతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించనున్న సమావేశంలోనూ దీనిపై చర్చ జరగనుందని సమాచారం.
