Dec 05,2022 08:01

ఇక్కడి గాలి
కేవలం ఊపిరి పీల్చడానికే కాదు
దేహంలోంచి
బీజాక్షరాల్ని పుట్టిస్తుంది

ఇక్కడి నీరు
కేవలం దాహం తీర్చుకోడానికే కాదు
అది లేత మొక్కల వంటి పదాల్ని కూడా సృష్టిస్తుంది

ఇక్కడి మట్టి
నడుస్తున్న పాదాల్లోంచి
పైపైకి తల దాకా అట్టే అల్లేస్తుంది
కన్ను తెరిచిన ప్రతి కొత్త వాక్యం
ఓ పూ పరిమళభరిత లతిక
ఇక్కడి ఉదయించబోయే సూరీడు
లోకాన్నే కాదు
లోపలి పద్యాల్ని తట్టి లేపుతాడు
ఇక్కడి ఆకాశం రాత్రి పూట
తన అందాల్ని సంపూర్ణంగా చూడగలిగే అవకాశాన్నిస్తుంది

ఇక్కడి పరిసరాలన్నీ
మళ్లీ
ఆరేళ్ల బాలుణ్ణి చేసి ఆడుకొంటాయి
ఇక్కడికి రావడమంటే
ముగ్గురు తల్లుల వద్దకు ముద్దుగా చేరుకోవడం ...
ఒకరు మాత
మరొకరు మాగాణి మాత
ఇంకొకరు - ఇంటిముందు
చలువ కొమ్మల చల్లని మాత

- రవి నన్నపనేని
91821 81390