అమరావతి : విజయవాడ బస్టాండ్‌లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌లో ఆర్‌టిసి బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ప్లాట్ ఫాం పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. విజయవాడ బస్టాండులో జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు. కాలం చెల్లిన బస్సుల కారణంగానే రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా ఆర్‌టిసి గ్యారేజీల్లో నట్లు, బోల్టులు కొనుగోలుకు కూడా ప్రభుత్వం నిధులివ్వడం లేదని ఆరోపించారు.