Jul 17,2023 08:34

అదిగదిగో మన ప్రగతి జాడ
మువ్వన్నెల జెండా
రెపరెపలాడుతూ ఎగిరింది
భారత జాతి గర్వపడంగా
త్యాగధనుల త్యాగనిరతికి తరగని చిహ్నమై
మహనీయుల మమతల
మహిమాన్విత రూపమై
దివ్య యశస్సుల ప్రచండ దీపమై
నవ ఉషస్సుల ప్రబోధ రాగమై
// అదిగదిగో//
సస్య శ్యామలమై
ప్రేమామృత శాంతి ధామమై
నాగరికతలకు ఆద్యమై
మానవాళి మనుగడకే విశ్వమాతయై
విశేష సంస్కృతుల అశేష ఖ్యాతియై
ఇలా తలాన భారతీయ
సౌరభాలు విరజిమ్ముతూ
// అదిగదిగో//
పర్వత పంక్తులు, జీవనదులు ప్రణమిల్లగా
హిమ శైలాలు వింజామరలు వీచగా
వింధ్య సంధ్యావందనంతో స్వాగతించగా
అవనిలో విశిష్ట సంపద గనియై
భారత ఆశా కిరణమై విశ్వ ప్రకాశినియై
// అదిగదిగో//
 

భావ శ్రీ
8106586997.