May 04,2023 06:31

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొత్త ఆర్థిక సంవత్సరంలో తొలి నెల లోటుతోనే ప్రారంభం అయింది. ఏకంగా రూ.12 వేల కోట్లకు పైగా లోటు నమోదు కావడం విశేషం. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఆదాయం కన్నా వ్యయం భారీగా ఉండడంతో ఈ లోటు నెలకొంది. ఏప్రిల్‌లో కేవలం రూ.8,147 కోట్లు ఆదాయం రాగా, వ్యయం మాత్రం ఏకంగా రూ.20,320 కోట్లు రికార్డు అయినట్లు తేలింది. దీంతో రూ.12,173 కోట్లు లోటుగా ఉన్నట్లు తేలింది. ఏప్రిల్‌లో సెక్యూరిటీ వేలం ద్వారా ఆరువేల కోట్లను రుణంగా తీసుకున్నారు. అయినప్పటికీ ఇంత లోటు నెలకొనడం గమనార్హం.