ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ సీఐ నరసింహారావు ఫ్లయింగ్ స్క్వాడ్ తో గురువారం పోలి చెరువు కట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కారులో తరలిస్తున్న రూ 30 లక్షల నగదును గుర్తించారు. చెన్నైకు చెందిన వెంకటరమణ.. రాజంపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద స్థలం కొనేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. సరియైన పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో నగదును స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు సీఐ నరసింహారావు తెలిపారు.










