Oct 19,2023 12:00
  •  స్వదేశాలనుంచి విదేశాలకు తరలించే ప్రయత్నం

హైదరాబాద్‌ : అబుదాబి ప్రయాణికుడి వద్ద భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌- శంషాబాద్‌ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది. నిందితుడి లగేజీని సీఐఎస్‌ఎఫ్‌ ఆధికారులు స్క్రీనింగ్‌ చేశారు. అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లను గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ అధికారులు నిందితుడిని కస్టమ్స్‌ అధికారులు అప్పగించారు. స్వదేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అక్రమ బంగారం పట్టుబడడం ఎయిర్‌ పోర్ట్‌ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. దుబారు, షార్జా, అబుదాబి నుంచి అక్రమ బంగారం పట్టుబడడం చూసిన అధికారులు మొదటి సారి ఇండియా నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడం మొదటి సారి కావడం విశేషం.