సైకో పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయి : మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
- నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టిడిపి శ్రేణులు
ప్రజాశక్తి-మడకశిర రూరల్ (శ్రీసత్యసాయి) : టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు బాబునాయుడు శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ పర్యటన తరుణంలో వైసీపీ అల్లరి మూకలు చేసిన రాళ్ల దాడిని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తీవ్రంగా ఖండించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని శనివారం బాలాజీ నగర్‌లో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి టిడిపి నాయకులను అంబేద్కర్ సర్కిల్లో నిరసనకు బయలుదేరడంతో ముందస్తుగా పోలీసులు అడ్డుకోవడంతో టిడిపి కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి టిడిపి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై వైసీపీ మూకలు దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇటువంటి పైశాచికాలకు పాల్చకున్నారని మండిపడ్డారు. మరో తొమ్మిది నెలల్లో వైసిపి ఆడ్రస్ ఉండదని అన్నారు. రాష్ట్ర హౌం మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పులివెందుల పుంగనూరు పర్యటనలో జనం నీరాజనం పడుతుండడాన్ని ఓర్వలేని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటువంటి చౌకబారు, నీచమైన చర్యలకు దిగడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఆరాచకాలను జనం గమనిస్తున్నారన్నారు. పరిపాలన చేతకాని సీఎం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమయ్యారన్నారు. చంద్రబాబుపై రాళ్లు దాడులు పిరికిపందల చర్య అని, ఇటువంటి దాడులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహారశైలి మార్చుకోవాలని, లేనిపక్షంలో వారు కూడా ఇబ్బంది పడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, పట్టణ మండల కన్వీనర్లు మనోహర్, లక్ష్మీనారాయణ, సత్యసాయి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు భక్తర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, కల్లుమరి సర్పంచ్ నాగరాజు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.










