ఈ ఉదయం
తెల్లారకపోతే బావుండు
నా దేశం చీకట్లో ఉందని
పోరాటం చేసే వాడిని !
ఈ క్షణం
సంకెళ్ళు సడలకుంటే బావుండు
బానిసత్వంలో వున్నానని
నాకు సర్దుకునేవాడిని
ఈ పురిటి నొప్పులు
ఇలాగే ఉండి పోతేబావుండు
కన్ను తెరవలేదని
కాలంతో తృప్తిగా కదిలే వాడిని
నా చూపు ఒట్టిపోతే బావుండు
నా ప్రపంచం గుడ్డిదని
సిగ్గు విడచిన చరిత్రకు
జీవశ్చవమై జవాబిచ్చే వాడిని!
నగంగా నడిచింది నీవు కాదు
వంద కోట్ల భారతీయులం
నడివీధిలో జన్మ స్థానాన్ని నిలబెట్టి
మృగాలమై అడవిని గుర్తు చేశాం
నీ ప్రతి కన్నీటి బొట్టులో
మమ్ము మేము ప్రక్షాళన చేసుకోవాలి
నీ ప్రతి అడుగులో
మా అహంకారాన్ని పాతాళానికి దించుకోవాలి
మన్నించడానికి మేం బతికిలేం
మరణించి చాలా కాలమైంది
మారామని మనసుకొస్తే
మరోసారి మమ్మల్ని
పవిత్రంగా కంటావు కదూ!
- నల్లు రమేష్
99897 65095










