కంచికచర్ల (ఎన్‌టిఆర్) : బైక్‌ను కారు ఢీకొట్టడంతో వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని పేరకలపాడు 65 వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పేరకలపాడు క్రాస్ రోడ్ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న కంచికచర్లకు చెందిన నన్నపనేని వీర నాగేశ్వరరావు (60) మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










