ప్రజాశక్తి - చాపాడు(కడప) : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లక్ష్మీపేట విలేజ్ హెల్త్ క్లినిక్‌ను జిల్లా వైద్యాధికారి డా.కె నాగరాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్లినిక్‌లో ఈ సంజీవని, మందుల రికార్డ్‌లను తనిఖీ చేశారు. స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, గర్భవతులకు ఇవ్వవలసిన పోషణ , చిన్నపిల్లల భోజన వసతిని పరిశీలించారు. ఏఎన్‌ఎం, అంగన్వాడి వర్కర్ దగ్గర గర్భవతుల వివరాలు ఒకటే విధంగా ఉండాలని వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించి సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ కుమార్ , ఎంఒ జీవి రెడ్డి, ఎఎంఓ ప్రసాద్, ఎంపీహెచ్‌ఓ ఎంవివి ప్రసాద్, సిహెచ్‌ఓ, ఏఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.










