ప్రజాశక్తి- చిన్నగంజాం (బాపట్ల) : ఓట్ల తొలగింపు ప్రక్రియపై వచ్చిన దరఖాస్తులను పున్ణ విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. చిన్నగంజాం మండలంలో ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియకు సంబంధించిన దస్త్రాలను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. చిన్నగంజాం మండల తహశీల్దార్ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మారకదర్శకాలను అనుసరించి బిఎల్‌ఓలు విధులు నిర్వహించాలన్నారు. చిన్నగంజాం మండలంలోని 262, 269, 273, 274, 279, 282, 294 పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దరఖాస్తులను ఆయన స్వయంగా విచారించారు. తొలగింపుల కోసం చట్టబద్ధంగా దరఖాస్తుదారులకు నోటీసులు ఇవ్వాలన్నారు. బిఎల్‌ఓల పనితీరుపై ఎన్నికల అధికారుల పర్యవేక్షణ పెరగాలన్నారు. ఫారం-7 దరఖాస్తుల విచారణ ప్రక్రియపై క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అత్యంత పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో సమస్యలు ఉత్పన్నంగాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చీరాల ఇంచార్జి ఆర్ డి ఓ జి.రవీందర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి పాల్గొన్నారు.










